రీసెంట్ గానే సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమాతో తన కెరీర్ లో మరో సాలిడ్ గ్రాసర్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత తన నుంచి రానున్న ప్రాజెక్ట్ లలో ఇటీవల అనౌన్స్ అయ్యిన ఓ సినిమాకి షాకింగ్ గా దర్శకు బయటకి తప్పుకోవడం ట్విస్ట్ గా మారింది. మరి ఇదిలా ఉండగా రజినికాంత్ ఫ్యాన్స్ కి ఇంకో ఇంట్రెస్టింగ్ టాక్ ఇప్పుడు వినిపిస్తుంది.
దీని ప్రకారం స్టార్ హీరో ధనుష్ రజినీకాంత్ ని డైరెక్ట్ చేయనున్నాడు అంటూ రూమర్స్ మొదలయ్యాయి. దాదాపు కాంబినేషన్ అయితే ఫిక్స్ అనే అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది బయటకి రావాల్సి ఉంది. ఇక ధనుష్ కూడా పలు సినిమాలు హీరోగానూ చేస్తున్నాడు అలానే దర్శకునిగా కూడా చేస్తున్నాడు. మరి రజినీకాంత్ తో సినిమాపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో ఆగి చూడాల్సిందే.


