ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ఆంధ్ర కింగ్ తాలూకా. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర సాలిడ్ రోల్ లో దర్శకుడు పి మహేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ రిలీజ్ డేట్ కి సర్వం సిద్ధం చేస్తున్నారు. అయితే మేకర్స్ నిజానికి ఈ సినిమాని ఈ నవంబర్ 28 డేట్ కి లాక్ చేసిన సంగతి తెలిసిందే. కానీ థియేటర్స్ లో ఈ సినిమా ఒకరోజు ముందే సందడి చేసేందుకు సిద్ధం అయ్యింది.
అయితే దీనికి ఒక్క రోజు ముందే థియేటర్స్ లో సినిమా పడుతున్నట్టు రామ్ లేటెస్ట్ గా కొత్త రిలీజ్ డేట్ తో వచ్చాడు. సినిమా కంటెంట్ ముందే డెలివర్ కావడంతో ఒక రోజు ముందే అంటే నవంబర్ 27 నుంచి వరల్డ్ వైడ్ గా ఈ సినిమా అలరించనుందని రామ్ కన్ఫర్మ్ చేసాడు. సో ఇది మాత్రం తన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి వివేక్ మెర్విన్ లు సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


