అక్కినేని నాగార్జున హీరోగా అమల అక్కినేని హీరోయిన్ గా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రం శివ కోసం అందరికీ తెలిసిందే. ఇండియన్ సినిమా దగ్గర ఒక గేమ్ ఛేంజింగ్ చిత్రంగా నిలిచిన ఈ సినిమా మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత సాలిడ్ రీరిలీజ్ కి వచ్చింది. ఈ సినిమా ది బెస్ట్ రీరిలీజ్ గా మంచి పేరు కూడా తెచ్చుకుంది. ఇక ఇలా వరల్డ్ వైడ్ గా సాలిడ్ ఓపెనింగ్స్ ని మొదటి రోజు అందుకున్న ఈ సినిమా రెండో రోజు కూడా అదే స్ట్రాంగ్ హోల్డ్ ని కనబరిచింది.
ఇక ఈ చిత్రం రెండు రోజుల్లో 3.95 కోట్ల గ్రాస్ ని ఈ సినిమా అందుకుంది. ఇలా ఈ రెండు రోజుల్లో దాదాపు 4 కోట్ల గ్రాస్ ని అందుకున్న ఈ సినిమా మూడో రోజు కూడా వీకెండ్ తో కలిసిరావడంతో మంచి నంబర్స్ నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించగా శుభలేఖ సుధాకర్, రఘువరన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.


