టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం SSMB29 కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రాజమౌళి రూపొందిస్తు్న్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
అయితే, ఈ చిత్ర షూటింగ్‌కు సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్‌ను కెన్యా దేశంలోని దట్టమైన అడవుల్లో చిత్రీకరించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఆయన చేస్తున్నాడట. కానీ, ఇప్పుడు రాజమౌళి అండ్ టీమ్‌కు ఓ ఊహించని ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. కెన్యా దేశంలో అంతర్గత కలహాలతో అక్కడి పరిస్థితి సరిగా లేవని తెలుస్తోంది. దీంతో ఇలాంటి పరిస్థితుల్లో కెన్యాలోని అడవుల్లో షూటింగ్ చేయడం కష్టమని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఈ పరిణామంతో రాజమౌళి అండ్ టీమ్ అయోమయంలో పడినట్లు సినీ సర్కిల్స్ టాక్. మరి ఇప్పుడు రాజమౌళి ఈ చిత్ర షూటింగ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.