ఇప్పుడు ఒక్క తెలుగు సినిమా నుంచే కాకుండా మొత్తం ఇండియన్ సినిమా దగ్గరే బిగ్గెస్ట్ సినిమా ఈవెంట్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమా కోసం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో అత్యంత ఘనంగా అట్టహాసంగా జరగనున్న ఈ ఈవెంట్ విషయంలో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ ఈవెంట్ కి రావాలని అనుకుంటున్న వారికి ముందు జాగ్రత్తగా ఒక అలర్ట్ మెసేజ్ ని వీడియో రూపంలో అందించారు.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారు ఎవరైనా రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ నుంచి ఎలా రావాలి ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి, ఎంత త్వరగా వస్తే మంచిది అనే అంశాలు జక్కన్న క్లుప్తంగా వివరించడం జరిగింది. అంతే కాకుండా ఈసారి ఈవెంట్ లో 18 ఏళ్ళు లోపల, సీనియర్ సిటిజన్స్ కి ఎలాంటి అనుమతి పోలీస్ యంత్రాంగం నుంచి లేదని కూడా క్లియర్ గా చెప్పేసారు.
అంతే కాకుండా తమ సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని యంత్రాంగం ఆరోజు పని చేయనుంది అని ఆరోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా కూడా ఈవెంట్ రద్దు చేసాయబడుతుంది అని రాజమౌళి తెలిపారు. దీనితో తన వీడియో ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.
