లేటెస్ట్ గా రిలీజ్ అయ్యిన హిట్ చిత్రమే ది గర్ల్ ఫ్రెండ్. రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తన కెరీర్ లో మరో మంచి హిట్ గా నిలిచింది. మరి ఈ సినిమా సక్సెస్ ని చిత్ర యూనిట్ ఎంజాయ్ చేస్తుండగా లేటెస్ట్ గా ఓ క్లిప్ సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. సినిమా చూసాక ఓ అమ్మాయి తన చున్నీ తీయడం పలు అభిప్రాయాలకి దారి తీసింది.
అయితే ఇది ఎక్కువగా ట్రోల్స్ వైపే వెళ్లడంతో ప్రముఖ నిర్మాత, ఎస్ కె ఎన్ దీనిపై స్పందించడం జరిగింది. ఈ సినిమా చేసింది మీలో భయాన్ని పోగొట్టాలని కానీ చున్నీలు తీసేయడానికి కాదని, ఈ సినిమాలో ఇచ్చిన మెసేజ్ భయాన్ని పోగొట్టాలని మాత్రమే అని క్లాస్ తీసుకున్నట్టు అయ్యింది. దీనితో ఆ కాంట్రవర్సీకి ఒక చక్కటి ఎండింగ్ నే తాను అందించారు అని చెప్పవచ్చు.
