మహేష్ పోస్టర్ పై మరిన్ని అంచనాలు!

SSMB29

ప్రస్తుతం ఇండియన్ సినిమాని షేక్ చేస్తున్న అవైటెడ్ సినిమానే మన గ్లోబ్ ట్రాటర్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ నుంచి వస్తున్నా ఒకో అప్డేట్ ఇంకా పోస్టర్ లు ఆకట్టుకుంటున్నాయి. ఒకో పాత్రకీ పవర్ఫుల్ పేరుని రివీల్ చేస్తూ జక్కన్న స్టన్నింగ్ పోస్టర్స్ ని వదులుతుండగా ఇక నెక్స్ట్ రానున్న సూపర్ స్టార్ మహేష్ బాబు పోస్టర్ కోసమే అంతా మంచి ఎగ్జైటెడ్ గా ఉన్నారని చెప్పాలి.

రాజమౌళి మార్క్ విజన్, మహేష్ బాబు డైనమిక్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందో అని అభిమానులు ఉత్సహంగా ఉన్నారు. దీనితో మహేష్ బాబు పోస్టర్ పై మాత్రం గట్టి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ భారీ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా శ్రీ దుర్గ ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ నవంబర్ 15న గ్రాండ్ గా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ జరగనుంది.

Exit mobile version