‘అఖండ 2’ ఫస్ట్ సింగిల్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!

Akhanda-2

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా సంయుక్త ఇంకా హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో దర్శకుడు బోయపాతో శ్రీను తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “అఖండ 2 తాండవం”. మాస్ లో నెక్స్ట్ లెవెల్ హైప్ ఉన్న ఈ సినిమా కోసం అభిమానులు ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తుండగా ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి మేకర్స్ ఫస్ట్ సింగిల్ ని తీసుకొస్తున్నారు. ఇలా ఫస్ట్ సింగిల్ పై మరో క్రేజీ అప్డేట్ ని మేకర్స్ అందించారు.

రేపు నవంబర్ 14న సాయంత్రం 5 గంటలకి పీవీఆర్ జుహూ లో ఈ మొదటి సాంగ్ ని లాంచ్ చేస్తున్నట్టుగా వేదికని ఖరారు చేశారు. దీనితోనే అఖండ 2 పాన్ ఇండియా లెవెల్ ప్రమోషన్స్ ని మొదలు పెట్టుకున్నట్టే అనిక్ చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ డిసెంబర్ 5న సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version