బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హైదరాబాద్ లో సందడి చేసారు. మైక్రోసాఫ్ట్ సంస్థలో ఉద్యోగులతో ముచ్చటించారు. హైదరాబాద్ లో తను గడిపిన ఆనందక్షణాలు ట్విట్టర్ లో పేర్కొన్నాడు
“ఈ సాయంత్రం హైదరాబాద్ లో గడిపా. చాలా ప్రశాంతంగా వుంది. మా అమ్మ జన్మస్థలంలో గడపడం ఆనందకరం. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు నా ధన్యవాదాలు” అని తెలిపాడు
షారుఖ్ తల్లి, స్వర్గస్థులు లతీఫ్ ఫాతిమా ఖాన్ “హైదరాబాద్, పఠాన్ మరియు కాశ్మీరీ సంతతికి చెందినవారు” అని ముందేతెలిపారు. గత యేడు చెన్నై ఎక్స్ ప్రెస్ తో భారీ విజయం సాధించిన షారుఖ్ ఈ యేడు హ్యాపీ న్యూ ఇయర్ సినిమాతో మనముందుకు రానున్నాడు