గోపీచంద్ మరియు నయనతార చిత్రానికి దర్శకుడు మార్పు?


ఫిలిం నగర్ తాజా సమాచారం ప్రకారం గోపీచంద్ మరియు నయనతార ప్రధాన పాత్రలలో వస్తున్న చిత్రంకి ఇక నుండి శ్రీవాస్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి గతంలో భూపతి పాండియన్ దర్శకత్వం వహించాల్సి ఉండగా ఆ స్థానంలో శ్రీవాస్ దర్శకత్వం చేయ్యనున్నట్టు సమాచారం. గతంలో శ్రీవాస్, గోపిచంద్ తో కలిసి “లక్ష్యం” చిత్రం కోసం కలిసి పని చేశారు. ఈ చిత్రాన్ని రమేష్ టి నిర్మిస్తున్నారు. దర్శకుని మార్పు పై నిర్మాత ఇంకా ఎటువంటి అధికారికమయిన ప్రకటన చెయ్యలేదు. గోపీచంద్ తన రాబోతున్న చిత్రాలతో విజయం సాదించాలని ఆశిస్తున్నారు.

Exit mobile version