ఇంటర్వ్యూ : డైరెక్టర్ శ్రీరామ్ వేణు – ‘తమ్ముడు’లో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు డిఫరెంట్ లేయర్స్ కూడా!

ఇంటర్వ్యూ : డైరెక్టర్ శ్రీరామ్ వేణు – ‘తమ్ముడు’లో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు డిఫరెంట్ లేయర్స్ కూడా!

Published on Jun 30, 2025 7:00 PM IST

“సంక్రాంతికి వస్తున్నాం” బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ “తమ్ముడు”. నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. “తమ్ముడు” సినిమా జూలై 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్‌ను తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు డైరెక్టర్ శ్రీరామ్ వేణు.

– “తమ్ముడు” సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ట్రైలర్ లో కథ ఎలా ఉండబోతుందో చెప్పాం. సెన్సార్ వాళ్లు కొన్ని కట్స్ చెప్పారు. మేము ఆ కట్స్ వద్దు అనుకున్నాం. ఒప్పుకుంటే యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చేవాళ్లు. సినిమాలోని ఎస్సెన్స్ ను సరిగ్గా ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలనే కట్స్ లేకుండా ఎ సర్టిఫికెట్ తీసుకున్నాం. ఇది మా అందరి ఉమ్మడి నిర్ణయం. దిల్ రాజు గారు ఒక్కరే ఈ డెసిషన్ తీసుకోలేదు. సినిమాలో అంతగా హింస లేదు. కొత్తగా వచ్చిన సెన్సార్ ఆఫీసర్స్ స్ట్రిక్ట్ గా ఉన్నారు. వాళ్లనూ తప్పు పట్టలేం. వారి గైడ్ లైన్స్ ప్రకారం వర్క్ చేస్తుంటారు.

– ఈ కథలో హీరోతో పాటు ఐదుగురు లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్, దిత్య ముఖ్యమైన పాత్రలు చేశారు. హీరో అంటే ఇంత లెంగ్త్ ఉండాలి అనేది “తమ్ముడు”లో ఉండదు. హీరోతో పాటు ఐదుగురు వుమెన్ క్యారెక్టర్స్ బలంగా ఉంటాయి. విక్రమ్ లో కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కథలో ఎలా ట్రావెల్ అవుతుందో అలా మా మూవీలోనూ ఉంటుంది. కథ ప్రకారమే తమ్ముడు టైటిల్ పెట్టాం.

– “తమ్ముడు” కథ విని దిల్ రాజు గారు బడ్జెట్ గురించి ఆలోచించకుండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. అంతకుముందు మా కాంబోలో ఐకాన్ మూవీ కోసం వర్క్స్ చేసుకున్నాం. ఆ తర్వాత ఈ మూవీ స్టార్ట్ చేశాం. ఈ కథకు సెట్ అయ్యే హీరో కోసం సెర్చ్ జరిగింది. నితిన్ బాగుంటాడని తీసుకున్నాం. ఓ దినపత్రికలో వచ్చిన ఆర్టికల్ స్ఫూరితో “తమ్ముడు” కథను సిద్ధం చేసుకున్నా.

– లయ గారి పాత్ర కోసం ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఒకరికి కథ చెప్పాను. ఆమెకు స్టోరీ, క్యారెక్టర్ నచ్చింది కానీ తన పర్సనల్ రీజన్స్ వల్ల నటించలేదు. అయితే మరోసారి ఇలాంటి క్యారెక్టర్ వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పింది. ఆ తర్వాత లయ గారు ప్రాజెక్ట్ లోకి వచ్చారు. ఆమెది ఈ మూవీలో 90 డేస్ క్యారెక్టర్. తను బాగా సపోర్ట్ చేసి మూవీ ఫినిష్ చేసింది.

– బడ్జెట్, క్రియేటివ్ పరంగా దిల్ రాజు గారు “తమ్ముడు” మూవీ బాధ్యత మొత్తం నాకే అప్పగించారు. సినిమా మొత్తం కంప్లీట్ అయ్యాక ఆయనకు చూపించాం. ఆయన ఎక్సిపీరియన్స్ ప్రకారం కొన్ని సజెషన్స్ ఇచ్చారు. వాటిని ఇన్ క్లూడ్ చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. 8 నెలల్లో ఈ సినిమాను కంప్లీట్ చేయాలనుకున్నాం కానీ రెండేళ్లు పట్టింది. అయినా మేము ముందు అనుకున్న బడ్జెట్ లోనే మూవీ ఫినిష్ చేశాం.

– కాంతార చూశాక సప్తమిగౌడ మా మూవీలోని క్యారెక్టర్ కు బాగుంటుందని అనిపించి తీసుకున్నాం. తను బాగా పర్ ఫార్మ్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ చాలా టాలెంటెడ్. మా మూవీకి మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. థియేటర్ లో ఆయన వర్క్ చూస్తారు. నిడివి పరంగా చూస్తే నేను ఎక్కువ లెంగ్త్ షూటింగ్ చేయను. ఈ సినిమాలో ల్యాగ్ ఉండదు. రాజు గారు సినిమా చూశాక ఎక్కడా కట్స్ చెప్పలేదు.

– రాజు గారి ప్రొడక్షన్ లో నాకు కావాల్సినంత స్వేచ్ఛ, కంఫర్ట్ ఉంటుంది. ఇలాంటి కంఫర్ట్ తో మరో మంచి అవకాశం వస్తే ఇంకో బ్యానర్ లోనూ మూవీ చేస్తా. రాజు గారు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీసి ఉంచలేదు. పాన్ ఇండియా సినిమా చేయకూడదని కాదు. అలాంటి ప్రాజెక్ట్ కుదిరితే తప్పకుండా చేస్తా. పాన్ ఇండియా అని రిలీజ్ చేసిన అన్ని సినిమాలు ఆదరణ పొందలేదు కదా.

– ఐకాన్ మూవీ సెట్స్ మీదకు వెళ్లని టైమ్ లో నేను బాధపడలేదు. ఎందుకంటే నా కెరీర్ లో మొదటి చిత్రానికి రెండో సినిమాకు మధ్యలో ఏడేళ్ల గ్యాప్ వచ్చింది. అప్పటికి పెళ్లై పిల్లలు ఉన్నారు. అలాంటి టైమ్ లోనే సర్వైవ్ అయ్యాను. కాబట్టి లైఫ్ లో దేనికీ డిప్రెషన్ లోకి వెళ్లలేదు. రాజు గారి బ్యానర్ లోనే వేరే సినిమాలకు వర్క్ చేస్తూ వచ్చాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు