బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా నటిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో సీత పాత్ర కోసం ముందుగా శ్రీనిధి శెట్టిని సెలెక్ట్ చేశారని.. కానీ, గతంలో కేజీయఫ్ చిత్రంలో యష్ పక్కన హీరోయిన్‌గా చేసి, ఇప్పుడు ఆయన రావణుడిగా, తాను సీతగా చేస్తే అభిమానులు అంగీకరించరని ఆమె ఈ సినిమాను తిరస్కరించిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి.
తాజాగా శ్రీనిధి శెట్టి ఈ వార్తలపై స్పందించింది. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. “నిజానికి రామాయణం కోసం నేను కూడా ఆడిషన్ ఇచ్చాను. అయితే, నేను సెలెక్ట్ కాలేదు. దీంతో ఆ పాత్ర సాయిపల్లవి చేస్తుంది. ఆమె అయితే, ఆ పాత్రకు పర్ఫెక్ట్‌గా యాప్ట్ అవుతుంది..’’ అంటూ చెప్పుకొచ్చింది.
మొత్తానికి రామాయణ చిత్రంలో శ్రీనిధి నటించకపోవడంపై ఓ క్లారిటీ వచ్చింది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో రాశి ఖన్నా మరో హీరోయిన్‌గా నటిస్తుండగా అక్టోబర్ 17న ఈ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.