‘శ్రీమంతుడు’ ఖాతాలో మరో రికార్డ్ !

‘శ్రీమంతుడు’ ఖాతాలో మరో రికార్డ్ !

Published on Apr 17, 2020 10:00 PM IST

సూపర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా కొర‌టాల శివ తెర‌కెక్కించిన శ్రీమంతుడు యూట్యూబ్‌లో రికార్డ్స్ సృష్టిస్తోంది. ఇప్పటివరకూ ఈ సినిమా యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్‌ ని రాబ‌ట్టింది. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాణ సంస్థ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా అధికారికంగా ప్ర‌క‌టించింది. ఒక తెలుగు సినిమా యూట్యూబ్‌ లో ఇన్ని వ్యూస్‌ ని రాబట్టిన మొద‌టి సినిమా కావడం విశేషం.

సినిమాలో మంచి మెసేజ్ ఇస్తూనే మాస్ ఎలిమెంట్స్ ను కూడా బాగా ఎలివేట్ చేశాడు కొరటాల. ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచింది. పైగా అప్పటి వరకు ఏ దర్శకుడు చూపించని విధంగా మహేష్ బాబును ఈ సినిమాలో చూపించాడు కొరటాల శివ.

ఇక లాక్ డౌన్ కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని ప్రేక్షకులు పూర్తిగా సినిమాలనే చూస్తూ గడిపేస్తున్నారు. ఏమైనా శ్రీమంతుడు పై ఫ్యాన్స్ ఇంకా ఆసక్తి కనబరచడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు