జూలై చివరి వారంలో ‘శ్రీమన్నారాయణ’ టీజర్

జూలై చివరి వారంలో ‘శ్రీమన్నారాయణ’ టీజర్

Published on Jul 19, 2012 3:00 PM IST


నటసింహం నందమూరి బాలకృష్ణ పవర్ఫుల్ పాత్రలో తెరకెక్కిన చిత్రం ” శ్రీమన్నారాయణ”. ఈ చిత్రం యొక్క మొదటి టీజర్ ని జూలై 23 న విడుదల చేయనున్నారు. ఈ చిత్ర ఆడియోను ఆగష్టు 6న విడుదల చేయనున్నారు అని ఇది వరకే తెలిపాము మరియు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ఆగష్టు చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలకృష్ణ ఈ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రను పోషిస్తున్నారు. ఇషా చావ్లా మరియు పార్వతి మెల్టన్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించారు.

రవి కుమార్ చావాలి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్.ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాల నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు