ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న శ్రీ కాంత్ – ప్రభు మూవీ

ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న శ్రీ కాంత్ – ప్రభు మూవీ

Published on Apr 17, 2013 8:00 AM IST
First Posted at 11:30 on Apr 17th

Sri-Raja-Rajeswari-Pictures

ప్రముఖ కధానాయకుడు శ్రీకాంత్, మేఘన జంటగా రాజరాజేశ్వరి పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా నిర్మాత రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 5 నుంచి 15 వరకు హైదరాబాద్ లోని పలు ప్రదేశాలలో చిత్రం షూటింగ్ జరిపాము. రామోజీ ఫిలిం సిటీలో ఓ గీతాన్ని, పోరాట దృశ్యాలను కూడా చిత్రీకరించటం జరిగిందని’ తెలిపింది.

ఈ సినిమాలో శ్రీకాంత్ దొంగగా, మేఘన టీచర్ పాత్రల్లో కనిపించనున్నారని డైరెక్టర్ జర్నలిస్ట్ ‘ప్రభు’ తెలిపారు. మే 1 నుంచి తర్వాతి షెడ్యూల్ మొదలు కానున్న ఈ సినిమాని జులైలో విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు