ప్రారంభమైన శ్రీకాంత్ కొత్త సినిమా

ప్రారంభమైన శ్రీకాంత్ కొత్త సినిమా

Published on Apr 6, 2013 11:32 AM IST

srikanth

ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ హీరోగా సినియర్ జర్నలిస్ట్ ప్రభు దర్శకత్వంలో సినిమా రాబోతోంది. ఈ సినిమాలో మేఘన హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమా నిన్న ఫిల్మ్ నగర్లోని గుడిలో ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభనికి విచ్చేసిన వి.వి. వినాయక్ కెమరా స్విచ్ అన్ చేయగా దాసరి నారాయణ రావు గారు క్లాప్ కొట్టారు, కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో శ్రీకాంత్ యాక్షన్, ఎమోషన్స్ పాత్రలో నటించనున్నాడు. త్వరలో ఈ సినిమాని హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూట్ చేయనున్నారు. పోసాని కృష్ణ మురళి, చిత్రం శ్రీను, అదుర్స్ రఘు, ఏవీయస్ లు నటిస్తున్న ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాని రాజరాజేశ్వరీ పిక్చర్స్ పతాకం పై రాజరాజేశ్వరి, వి. శ్రీనివాస్ లు నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు