100 సినిమాలు పూర్తి చేసిన క్రికెటర్ లా మన ఫ్యామిలీ హీరో శ్రీ కాంత్ 100 సినిమాలు పూర్తి చేసిన తర్వాత జోరు పెంచి టాప్ స్పీడ్ తో సినిమాలు ఒప్పుకుంటున్నారు, అలాగే అనుకున్న సమయానికి పూర్తి చేసి విడుదల చేస్తున్నారు. శ్రీ కాంత్ నటించిన ‘లక్కీ’ సినిమా ఈ నెల 1న విడుదలయ్యింది. ఈ సినిమా కాకుండా శ్రీకాంత్ ప్రస్తుతం ‘దేవరాయ’, ‘శత్రువు’ ‘సేవకుడు’ మరియు ‘షాడో’ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న శ్రీ కాంత్ ఇప్పుడు మరో కొత్త సినిమాని ఒప్పుకున్నారు. గతంలో ‘పెళ్లి కాని ప్రసాద్’ సినిమా తీసిన ద్వారపూడి సత్యనారాయణ ఈ కామెడీ ఎంటర్టైనర్ కి దర్శకత్వం వహించనున్నారు. పుష్యమి ఫిల్మ్ మేకర్స్ పతాకంపై బెల్లం రామకృష్ణా రెడ్డి నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘ అందరికీ ఎప్పటికీ గుర్తుండి పోయే సినిమాలు తీయాలనే ఉద్దేశంతో ఈ బ్యానర్ ని స్థాపించాము. మా డైరెక్టర్ కథ చెప్పగానే సింగల్ సిట్టింగ్లో శ్రీకాంత్ ఒప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ నెలాఖరులో చిత్రీకరణ మొదలవుతుందని’ ఆయన అన్నారు. మిగిలిన నటీనటుల వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.
మా కథ విని సింగల్ సిట్టింగ్లో ఒప్పుకున్నారు.!
మా కథ విని సింగల్ సిట్టింగ్లో ఒప్పుకున్నారు.!
Published on Nov 7, 2012 8:35 PM IST
సంబంధిత సమాచారం
- ఈ భాషలో కూడా ‘ఓజి’ రిలీజ్!?
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘లోక’ సెన్సేషన్ .. వరల్డ్ వైడ్ 202 కోట్లతో మరో ఫీట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ‘మదరాసి’కి ప్లాన్ చేసుకున్న మరో క్లైమాక్స్ చెప్పిన మురుగదాస్.. ఇలా చేసుంటే?
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- అవైటెడ్ ‘ఓజి’ ట్రైలర్ ఆరోజున?
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ ?
- అల్లు అర్జున్ కూడా అప్పుడే వస్తాడా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన లేటెస్ట్ కన్నడ హిట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ