నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!

నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!

Published on Sep 10, 2025 10:07 AM IST

Kantara

రిషబ్ శెట్టి హీరోగా తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రమే “కాంతార 1”, రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పట్ల పాన్ ఇండియా లెవెల్లో మంచి బజ్ నెలకొంది. ఇక ఈ సినిమా అన్ని పనులు ముగించుకొని ఆన్ టైం రిలీజ్ కి వస్తుండగా తెలుగులో కూడా భారీ లెవెల్లో రిలీజ్ కి రాబోతుంది. మరి ఈ సినిమా నైజాంలో డీల్ ని పూర్తి చేసుకుంది.

ఈ సినిమాని మైత్రి డిస్ట్రిబ్యూషన్ వారు సొంతం చేసుకుని వారి నుంచి భారీ రిలీజ్ కి తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమా నైజాం మార్కెట్ లో ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ అక్టోబర్ 2న గ్రాండ్ గా సినిమా రిలీజ్ కి రాబోతుంది.

తాజా వార్తలు