లేటెస్ట్ గా రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో శివ కార్తికేయన్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “మదరాసి” కూడా ఒకటి. అయితే మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా శివ కార్తికేయన్ కెరీర్లో తమిళ్ వరకు ఓకే రేంజ్ లో పెర్ఫామ్ చేస్తుంది కానీ తెలుగు వెర్షన్ డౌన్ అయ్యింది. మరి ఈ సినిమా విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ అంశాన్ని దర్శకుడు పంచుకోవడం వైరల్ గా మారింది.
ఈ సినిమాలో చూపించిన క్లైమాక్స్ వేరు తాను మొదటగా అనుకున్న క్లైమాక్స్ వేరు అని తాను చెబుతున్నారు. తాను మొదట అనుకున్న క్లైమాక్స్ లో రుక్మిణి వసంత్ చేసిన మాలతీ రోల్ చనిపోయేలా రాసుకున్నారట. కానీ తన హీరోయిన్ ని కూడా హీరో కాపాడలేకపోతే అది సినిమా కోర్ కే కరెక్ట్ గా ఉండదు అని ఆ తర్వాత తాను మార్చినట్టు తెలిపారు. మరి అదే క్లైమాక్స్ తో చేసుంటే ఇంకోలా ఉండేది ఏమో.