నా సినిమాలో వాళ్ళిద్దరూ ఒక్కటే

నా సినిమాలో వాళ్ళిద్దరూ ఒక్కటే

Published on Dec 22, 2012 3:31 PM IST

Srikanth-addala
ఈ రోజుల్లో ఇద్దరు స్టార్ హీరోలని ఒకే సినిమాలో చేసేలా ఊపించి ఆ ఇద్దరినీ ఒకే ఫ్రేంలో చూపిస్తూ డైరెక్ట్ చేయడం అంటే మాటలు కాదు. ఒకప్పుడు ఉన్న పెద్ద హీరోలని డైరెక్ట్ చేయడం అంటే హీరోలు డైరెక్టర్ మాట వినేవారు కాబట్టి సమస్య ఉండేది కాదు. ఇప్పుడున్న హీరోల మధ్య ఇగో సమస్య వల్ల, సినిమాలో ఎవరికి ఇంపార్టెన్స్ తగ్గిన ఒప్పుకొని పరిస్థితి. వెంకటేష్, మహేష్ బాబు లాంటి ఇద్దరు స్టార్ హీరోలని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఒప్పించి సినిమా తీసి చూపించాడు శ్రీకాంత్ అడ్డాల. కొత్త బంగారు లోకం లాంటి చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయమై దాదాపు మూడు సంవత్సరాలుగా ఈ స్క్రిప్టుని నమ్మి ఇద్దరు స్టార్ హీరోలని ఒప్పించిన శ్రీకాంత్ ఇటీవల జరిగిన ఈ సినిమా ఆడియో వేడుకలో చాలా ఉద్వేగంగా మాట్లాడాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోలని ఎలా మైంటైన్ చేసారని అందరూ అడుగుతున్నారు నా కథలో, నా కలలో వాళ్ళిద్దరూ ఒకటే. ఈ సినిమా కథ తన అన్న కథ అని చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు