ఇండస్ట్రీలో అవకాశం వచ్చి మరీ అది వృధా అయితే చాలా బాధగావుంటుంది. పాపం ఈ కోవలోకే అక్టోబర్ లో స్వర్గస్థులైన శ్రీహరికూడా చెందుతాడు. ఆయన నటించిన చివరి హిందీ సినిమా ఆర్.. రాజ్ కుమార్ నిన్న విడుదలైంది. ఇందులో ఆయన అంతగా పసలేని విలన్ పాత్రపోషించాడు. ఈ సినిమా పై నెగిటివ్ టాక్ రావడంతో ఆయన కష్టం వృధా అయ్యింది.
ప్రభు దేవా తీసిన ఈ సినిమాలో ఇండోనేషియా కు చెందిన డ్రగ్ స్మగ్లర్ గా శ్రీ హరి కనిపించాడు. విశేషమేమిటంటే శ్రీహరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగా గుర్తింపుతెచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా కు కుడా ప్రభుదేవా దర్శకుడు