హీరో రామ్ చరణ్ కెరీర్ లో మగధీర అరుదైన చిత్రం. ఆ మూవీ సృష్టించిన రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావు. రామ్ చరణ్ ఈ మూవీలో ఈ జనరేషన్ ప్రేమికుడిగా, రాజుల కాలం నాటి యుద్ధ వీరుడిగా కనిపించారు. ఈ మూవీ కోసం ప్రమాదకరమైన స్టంట్స్ లో రామ్ చరణ్ పాల్గొన్నారు. కాగా మగధీరలో శ్రీహరిది కూడా ఓ కీలకమైన రోల్. ఆయన పాత్ర కూడా రెండు పీరియడ్స్ లో కనిపిస్తుంది. కాగా దివంగత శ్రీహరి హీరో చరణ్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండేవారట. ఈ విషయాన్ని రామ్ చరణ్ ఒకప్పటి వీడియోలో తెలియజేశారు.
మగధీర సెట్స్ లో ఏదైనా స్టంట్స్ చేస్తున్నప్పుడు శ్రీహరి స్వయంగా అక్కడి కార్యక్రమాలు పర్యవేక్షించేవారట. క్రేన్ రోప్స్, కింద బెండ్స్ సరిగా ఉన్నాయా లేవా అని పరీక్షించేవారట. దానికి చరణ్ మీకెందుకు ఇవన్నీ, స్టంట్ మాస్టర్ చూసుకుంటారు కదా అంటే, శ్రీహరి అయ్యో నీకు ఏదైనా జరిగితే మీనాన్న దగ్గర నాకు మాటొస్తుంది, అని అనేవారట.సెట్స్ లో శ్రీహరి తనపట్ల అంత కేరింగ్ ఉండేవారని చరణ్ తెలియజేశారు.