శ్రీహరి – రాజీవ్ కనకాల ‘తిక్క’


శ్రీహరి, ప్రియమణి, రాజీవ్ కనకాల, శివారెడ్డి ప్రధాన పాత్రలుగా థెరక్కెఉథున్న చిత్రం ‘తిక్క’. బి. ఆర్ దుగ్గినేని స్వీయ దర్శకత్వంతో పాటుగా ఈ సినిమాని కూడా ఆయనే నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర మూడవ షెడ్యూల్ హైదరబాదులో జరుగుతుంది. భరణి మినరల్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్ర తాజా షెడ్యూల్ ఈ నెల 20 వరకు జరుగుతుంది. తిక్క సినిమాని తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. నవంబర్ మొదటి వారానికి షూటింగ్ పూర్తి చేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పోసాని కృష్ణ మురళి, తాగుబోతు రమేష్, రఘు, వెంకట్, రఘు కాలే ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి రమణ గోగుల సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version