పైడ్ ప్రీమియర్స్ తో ‘లిటిల్ హార్ట్స్’.. మేకర్స్ కాన్ఫిడెన్స్

LittleHearts
టాలెంటెడ్ యువ నటుడు మౌళి తనూజ్ హీరోగా శివాని నాగారం హీరోయిన్ గా దర్శకుడు సాయి మార్తాండ్ తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రమే “లిటిల్ హార్ట్స్”. క్రేజీ ప్రమోషన్స్ నడుమ రిలీజ్ కి వస్తున్న ఈ సినిమా విషయంలో మేకర్స్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అనేది ఇపుడు అర్ధం అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి పైడ్ ప్రీమియర్స్ ని మేకర్స్ ఇపుడు ప్లాన్ చేస్తున్నారు.

రేపు సెప్టెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ అవుతుండగా ఇవాళే అంటే సెప్టెంబర్ 4న సాయంత్రం నుంచే హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ అలాగే రాజమండ్రి ప్రాంతాల్లో పైడ్ ప్రీమియర్స్ ని ప్లాన్ చేశారు. దీనితో చిత్ర యూనిట్ తమ ఎంటర్టైనర్ విషయంలో ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక చిత్రానికి శింజిత్ యర్రమిల్లి సంగీతం అందించగా 90స్ బయోపిక్ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మాణం వహించారు.

Exit mobile version