బాలీవుడ్ లో అడుగుపెట్టనున్న షేర్ ఖాన్

బాలీవుడ్ లో అడుగుపెట్టనున్న షేర్ ఖాన్

Published on May 24, 2013 1:15 AM IST

srihari
ప్రకాష్ రాజ్, అజయ్, సుప్రీత్ ల తరువాత మరో తెలుగు నటుడు బాలీవుడ్లో అడుగుపెట్టనున్నాడు. అతను మరెవరోకాదు మన శ్రీ హరి. అతను ప్రభు దేవా దర్శకత్వంలో ‘రాంబో రాజ్ కుమార్’ సినిమా ద్వారా బాలీవుడ్ కు పరిచయం కానున్నాడు. ఈ సినిమాలో షహీద్ కపూర్, సొనక్షి సిన్హా హీరో హీరోయిన్స్ కాగా సోనూ సూద్,ఆశిష్ విద్యార్ధి ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ప్రభుదేవాకు శ్రీ హరి నటన ఎంతగానో నచ్చేసిందట. అతని కెరీర్లో ఎదురైనా వాళ్ళలో శ్రీహరే బెస్ట్ యాక్టర్ అన్నాడు. విచిత్రంగా ప్రభుదేవా హిందీలో తెరకెక్కిస్తున్న ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా ‘ సినిమాలో శ్రీహరి పాత్రను సోనూ సూద్ పోషిస్తున్నాడు. ఈ సినిమాకు కూడా ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా వుంటే శ్రీహరి అపూర్వ లిఖియా తీస్తున్న ‘జంజీర్’ తెలుగు వెర్షన్ అయిన ‘తుఫాన్’ లో కుడా నటిస్తున్నాడు. కాస్త ఆలస్యం అయినా మన శ్రీహరి టాలెంట్ నలుగురికీ తెలిసే రోజులోచ్చాయన్నమాట.

తాజా వార్తలు