మరో సినిమా చేయబోతున్న శ్రీ దేవి


తన నటన మరియు అందంతో యావత్ భారత చలన చిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల తార శ్రీ దేవి. 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రంలో శ్రీ దేవి నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా శ్రీ దేవి తన నటించబోయే రెండవ చిత్రానికి అంగీకారం తెలిపిందని, అది కూడా 1990లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘ఖుదా గవా’ చిత్ర సీక్వెల్ లో శ్రీ దేవి నటించనుందని సమాచారం. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్ ల సరసన శ్రీ దేవి ద్విపాత్రాభినయం చేయనున్నారు. గతంలో వచ్చిన ఈ చిత్ర ఒరిజినల్ వర్షన్ లో కూడా అమితాబ్ బచ్చన్ మరియు నాగార్జునల సరసన కూడా శ్రీ దేవి ద్విపాత్రాభినయం చేశారు. మనోజ్ దేశాయ్ నిర్మించనున్న ఈ చిత్రానికి ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి.

Exit mobile version