మలయాళంలో కూడా రాబోతున్న ‘శ్రీ రామరాజ్యం’

మలయాళంలో కూడా రాబోతున్న ‘శ్రీ రామరాజ్యం’

Published on Feb 2, 2012 5:44 PM IST

సీనియర్ దర్శకుడు బాపు వెండితెరపై ఆవిష్కరించిన పౌరాణిక దృశ్యకావ్యం ‘శ్రీ రామరాజ్యం’ విమర్శకుల ప్రశంసలతో పాటు సాధారణ ప్రేక్షకుల మనసును కూడా గెలుచుకుంది. చాలా రోజుల తరువాత మంచి భక్తిరస చిత్రం చూపించారని ప్రతీ ఒక్కరు మెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రం మలయాళంలో కూడా డబ్ చేయబోతున్నారు. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 14న మలయాళ నూతన సంవత్సర వేడుక సందర్భంగా విడుదల చేయాలనే యోచనలో ఉన్నారు. అలాగే ఈ చిత్రాన్ని హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో విడుదల
చేయాలని నిర్మాత సాయిబాబు గారు భావిస్తున్నారు.

తాజా వార్తలు