‘తుఫాన్’కు డబ్బింగ్ మొదలుపెట్టిన శ్రీహరి

‘తుఫాన్’కు డబ్బింగ్ మొదలుపెట్టిన శ్రీహరి

Published on Aug 17, 2013 12:02 PM IST

srihari

రామ్ చరణ్ బాలీవుడ్ లో తొలిసారిగా నటిస్తున్న సినిమా ‘జంజీర్’ తెలుగు వెర్షన్ అయిన ‘తుఫాన్’ డబ్బింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమా వచ్చే నెలలో విడుదలకానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు శ్రీ హరి డబ్బింగ్ చెప్తున్నాడు

హిందీ వెర్షన్ లో సంజయ్ దత్ పోషించిన పాత్రను ఇక్కడ తెలుగులో శ్రీహరి భర్తీ చేస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ డబ్బింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరికొన్ని రోజులలో ముగుస్తాయి

అపూర్వ లిఖియా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ‘తుఫాన్’ చిత్రాన్ని రిలయాన్స్ ఎంటర్టైన్మెంట్స్, పునీత్ ప్రకాష్ మెహ్రా, సుమిత్ ప్రకాష్ మెహ్రా మరియు ఫ్లైయింగ్ టర్టిల్స్ సంస్థ నిర్మిస్తున్నాయి

తాజా వార్తలు