యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో తీసిన ‘బాద్షా’ సినిమా సూపర్ సక్సెస్ తో డైరెక్టర్ శ్రీను వైట్ల ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఎన్.టి.ఆర్ – కాజల్ అగర్వాల్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద రికార్డ్స్ బద్దలు కొడుతోంది, ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్స్ లో ఇది కూడా చేరిపోయిందని అంటున్నారు. డైరెక్టర్ శ్రీను వైట్ల మీడియాతో ‘ మాట్లాడుతూ’ ‘దూకుడు’ సినిమా తర్వాత మరో హిట్ ఇవ్వాలని నా పై ఎంతో ఒత్తిడి ఉంది. అది కూడా మొదటి సారి ఎన్.టి.ఆర్ తో చేస్తుండడంతో ఆకాశాన్ని తాకే రేంజ్ లో అంచనాలున్నాయి. ఆ అంచనాలను రీచ్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమాకి వస్తున్న రిజల్ట్ చూసి ఎన్.టి.ఆర్ చాలా హ్యాపీగా ఉన్నారని’ అన్నాడు.
అలాగే ఎన్.టి.ఆర్ మెమరీ పవర్ గురించి, డైలాగ్ డెలివరీ, డాన్సింగ్ స్కిల్స్ గురించి అలాగే అతనికి బడ్జెట్ విషయంలో, సెట్స్ పైకి వెళ్ళాక ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరగాలి అనే విషయాలు బాగా తెలుసనీ ఎన్.టి.ఆర్ ని శ్రీను వైట్ల పొగడ్తలతో ముంచెత్తారు. మీ సక్సెస్ వెనకున్న సీక్రెట్ ఏంటి అని అడిగితే ‘ నా సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ అనేది మేజర్ పాయింట్. చాలా రోజుల క్రితం నాగార్జున గారు ‘నీ కోసం’ సినిమా చూసి సినిమా బాగుంది కానీ ఆడియన్స్ సినిమా అంటా నవ్వుతూ ఉండాలి అంటే ఇంకాస్త ఎంటర్టైన్మెంట్ ఉండాలని అన్నారు. అది నా ఆలోచనని మార్చేసింది. అప్పటి నుంచి మంచి ఎంటర్టైన్మెంట్స్ తీస్తున్నాను. ప్రస్తుతానికి నాకు ప్రయోగాలు చేసే ఆలోచన లేదు. నేనేం చేస్తున్నానో ఆ విషయంలో నేను హ్యాపీ గా ఉన్నానని’ అన్నాడు. శ్రీను వైట్ల తన తదుపరి సినిమా ‘ఆగడు’. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈ సంవత్సరం సేకదాఫ్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.