అందుకే స్లిమ్ అయ్యా – శ్రీలీల

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం ‘మాస్ జాతర’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ఈ సినిమాలో రవితేజ సరసన రెండోసారి జోడీ కట్టింది. ఈ బ్యూటీ. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్‌ను శరవేగంగా నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా శ్రీలీల తన స్లిమ్ లుక్‌పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ప్రేక్షకులు డబ్బులు పెట్టి సినిమాకు వస్తారు. వారికి బెస్ట్‌గా కనిపించేందుకు తాను ప్రయత్నిస్తున్నానని.. దీనికోసం తాను తినే ఫుడ్‌పై కంట్రోల్ పెట్టుకుంటున్నట్లు తెలిపింది. చిరుతిళ్లు మానేసి, తాను గతంలో తినే ఫుడ్‌పై కూడా కంట్రోల్ పెట్టుకున్నట్లు ఆమె తెలిపింది.

కేవలం స్లిమ్‌గా మారడమే కాకుండా ఆరోగ్యంగా ఉండేందుక పాటించాల్సిన విషయాలపై కూడా తాను శ్రద్ధ తీసుకుంటున్నట్లు శ్రీలీల తెలిపింది. ఏదేమైనా స్లిమ్‌గా మారడానికి గల కారణాలను శ్రీలీల తన ఫ్యాన్స్‌తో పంచుకుంది.

Exit mobile version