టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ ఫిలిం ఛాంబర్‌లో ఓ టైటిల్‌ను రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. క్లాసిక్ హిట్ మూవీ ‘ఏప్రిల్ 1 విడుదల’లోని ‘‘చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా..’’ అనే సాంగ్ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ పాటలోని మొదటి లైన్ ‘చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా’ అనే టైటిల్‌ను వైజయంతి మూవీస్ రిజిస్టర్ చేయించినట్లు సినీ సర్కిల్స్ టాక్.
అయితే, ఈ టైటిల్‌తో రాబోయే సినిమాకు సంబంధించి కథ ఓకే అయిందట.. దర్శకుడు కూడా రెడీ అయ్యాడట. ఇక ఈ సినిమా కథ హీరోయిన్ చుట్టూ తిరగనుందట. ఇందులో హీరోయిన్ పాత్రకు సాలిడ్ స్కోప్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాలో ఎవరు హీరోయిన్‌గా నటిస్తారా అనే ఆసక్తికరంగా మారింది. కాగా, ఈ పాత్ర కోసం శ్రీలీల, భాగ్యశ్రీ బొర్సె పేర్లు పరిశీలనలో ఉన్నాయట.
శ్రీలీల క్రేజ్, భాగ్యశ్రీ గ్లామర్‌తో ప్రేక్షకులను మెప్పిస్తారు. మరి ఈ సినిమాలో ఈ ఇద్దరిలో ఎవరు నటిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఈ చుక్కలు తెమ్మన్నా తీసుకురానా అనే టైటిల్‌కు ఏ బ్యూటీ సెలెక్ట్ అవుతుందో చూడాలి.