పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. భారీ హైప్ నడుమ వచ్చి పవన్ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ నుంచి ఒక హైయెస్ట్ గ్రాసర్ లలో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత దానికి పూర్తి భిన్నంగా వస్తున్న చిత్రమే “ఉస్తాద్ భగత్ సింగ్”. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాపై కూడా మంచి బజ్ ఉంది. ఇక ఈ సినిమాపై ఓ క్రేజీ బజ్ ఇపుడు వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ చిత్రం రిలీజ్ కావడానికి పెద్దగా సమయాన్ని మేకర్స్ తీసుకోరని వినిపిస్తుంది.
ఎందుకంటే ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి లోనే థియేటర్స్ లో వచ్చేసే ఛాన్స్ ఉందట. ఇది వరకు భీమ్లా నాయక్ తో డ్రై మంత్ అయ్యిన ఫిబ్రవరిలో అదరగొట్టారు. మరి ఇపుడు ఉస్తాద్ కూడా అప్పుడే అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి. ఇక ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.