‘మాస్ జాతర’ టైటిల్ పెట్టింది మాస్ రాజా రవితేజ..!

Mass-Jathara

ఒక సినిమా టైటిల్‌ను సాధారణంగా దర్శకుడు లేదా కథ రాసిన రచయిత నిర్ణయిస్తారు. ఇంకొన్ని సందర్భాల్లో నిర్మాత లేదా హీరో కూడా తమకు తోచిన టైటిల్‌ను ఫిక్స్ చేస్తారు. అయితే, తాజాగా మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘మాస్ జాతర’ చిత్రానికి సంబంధించిన టైటిల్ ఎవరు పెట్టారనే విషయంపై క్లారిటీ వచ్చింది.

దర్శకుడిగా పరిచయం అవుతున్న భాను భోగవరపు ఈ చిత్ర కథను రవితేజకు వినిపించగా, ఆయన వెంటనే ఈ సినిమాకు ‘మాస్ జాతర’ అనే టైటిల్ అయితే బాగుంటుందని సూచించాడట. ఇక దానికి ‘మనదే ఇదంతా’ అనే ట్యాగ్‌లైన్‌ను భాను భోగవరపు సజెస్ట్ చేశారట. ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల్లో భారీ రెస్పాన్స్ రావడంతో ఇదే టైటిల్‌ను కంటిన్యూ చేసినట్లు వారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. అక్టోబర్ 31న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version