ట్రైలర్ డేట్ ఫిక్స్ చేసుకున్న ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’

తమిళ యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం రెండు సినిమాలను రిలీజ్‌కు రెడీ చేశాడు. డ్యూడ్, LIK(లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) అనే సినిమాల్లో హీరోగా నటిస్తున్న ప్రదీప్ ఈ చిత్రాలతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన మార్క్ చూపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, ఈ రెండు చిత్రాలను తొలుత దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ, తమ హీరో చిత్రాలు రెండు ఒకేసారి క్లాష్ అవడం ఇష్టంలేక LIK మేకర్స్ తమ సినిమాను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక డ్యూడ్ మూవీ దీపావళి ట్రీట్‌గా అక్టోబర్ 17న వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది.

ఇక ఈ క్రమంలో డ్యూడ్ చిత్ర మేకర్స్ తమ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు. డ్యూడ్ మూవీ నుంచి టాప్ గేర్‌గా ఈ చిత్ర ట్రైలర్‌ను అక్టోబర్ 9న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఈ ట్రైలర్ కట్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని కీర్తిశ్వరన్ డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version