‘సింగిల్’ గ్లింప్స్.. శ్రీ విష్ణు మార్క్‌తో మరో ఎంటర్‌టైనర్!

‘సింగిల్’ గ్లింప్స్.. శ్రీ విష్ణు మార్క్‌తో మరో ఎంటర్‌టైనర్!

Published on Feb 10, 2025 4:59 PM IST

టాలీవుడ్‌లో కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే బిరుదు తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకెళ్తున్నాడు. ఆయన నటించే సినిమాలు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలుగా ప్రేక్షకులను మెప్పి్స్తున్నాయి. ఇక ఈ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సింగిల్’. కార్తిక్ రాజు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.

లవ్ అంటే ఏమాత్రం ఇష్టం లేని పాత్రలో శ్రీవిష్ణు మరోసారి సాలిడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రాబోతున్నాడు. ఈ సినిమాలో శ్రీ విష్ణు సింగిల్‌గా ఉన్నాడంటూ అతని పాత్రను ఇంట్రడ్యూస్ చేశాడు కమెడియన్ వెన్నెల కిషోర్. అయితే, అతడిని ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తున్నారని ఈ సినిమా కథలోని నేపథ్యాన్ని తెలియజేశాడు. ఇక మిగతా విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందేనని ఆయన తెలిపినట్లు ఈ వీడియో గ్లింప్స్ ముగించారు.

మొత్తానికి శ్రీవిష్ణు ఈ సారి ట్రై యాంగిల్ లవ్ స్టోరీ తో పాటు బోలెడంత ఎంటర్‌టైన్‌మెంట్‌ను కూడా పట్టుకొస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు