ఆంధ్రప్రదేశ్ లో సింగర్ శ్రావణ భార్గవికి మంచి పాపులారిటీ ఉంది. ఆమె ఎన్నో టెలివిజన్ షోస్ లో రెగ్యులర్ గా కనపడుతూ ఉంటుంది. ఈ యంగ్ సింగర్ ఓ ప్రమాదానికి గురైంది. నిన్న తన కారు హైదరాబాద్ – విజయవాడ మధ్యలో యాక్సిడెంట్ కి గురైంది.
శ్రావణ భార్గవి నిన్న ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడకి వెళుతోంది. నల్గొండ జిల్లాలోని చిత్యాల్ ఏరియా వద్ద ఓ ట్రాక్టర్ వాడు సడన్ గా అడ్డంగా రోడ్డు మీదకి రావడంతో దాని నుంచి తప్పించుకోవడానికి శ్రావణ భార్గవి అక్కడ ప్రాసెస్ లో ఉన్న ఓ డివైడర్ ని గుద్దింది. అదృష్టవశాత్తు ఈ యాక్సిడెంట్ లో తనకి ఏమీ కాలేదు. ఈ విషయం తెలుసుకోగానే తన భర్త హేమచంద్ర సంఘటనా స్థలానికి వచ్చి తన బాగోగులు చూసుకున్నాడు.