పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుండి వరుస అప్డేట్స్ సందడి చేశాయి. ‘ది రాజా సాబ్’ చిత్రం నుండి
ఓ కలర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్ అవగా.. ‘ఫౌజీ’ మూవీ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు. ఈ రెండు కూడా ప్రభాస్ అభిమానులను మెప్పించాయి.
కానీ, వారికి పూర్తిగా బర్త్ డే ట్రీట్ అందినట్లు అనిపించలేదు.
అయితే, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేశాడు. ప్రభాస్‌తో ఆయన అనౌన్స్ చేసిన ‘స్పిరిట్’ మూవీ నుంచి ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ వదిలాడు. కేవలం ఆడియో రూపంలో వచ్చిన ఓ వీడియోలో ‘స్పిరిట్’లో ప్రభాస్ పాత్రను ఎలివేట్ చేసిన తీరు ఆకట్టుకుంది. స్పిరిట్
మూవీలో ప్రభాస్ ఓ రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ జైలుకి వెళ్తాడని.. అక్కడ సూపరింటెండెంట్ అయిన ప్రకాష్ రాజ్ ప్రభాస్‌ను ట్రీట్ చేసే ఆడియో మనకు ఇందులో వినిపిస్తుంది.
ఇక చివర్లో ప్రభాస్.. ‘‘నాకు ఒక బ్యాడ్ హాబిట్ ఉంది..’’ అంటూ చెప్పిన డైలాగ్‌తో ఈ వీడియోను ముగించిన తీరుతో సందీప్ రెడ్డి ఫ్యాన్స్‌కు
అదిరిపోయే ట్రీట్ అందించాడు. ఇక ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి, వివేక్ ఓబెరాయ్, కాంచన, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
