100 మంది డాన్సర్లతో కలిసి స్టెప్పులేసిన ప్రభాస్

100 మంది డాన్సర్లతో కలిసి స్టెప్పులేసిన ప్రభాస్

Published on Oct 14, 2012 9:20 PM IST


మాటల రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ప్రస్తుతం యూరప్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన యోగా బ్యూటీ అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ్ ఆడి పాడుతున్నారు. గత కొన్ని రోజులుగా యూరప్లో ప్రభాస్, రిచా మరియు 100 మంది డాన్సర్లతో కలిపి ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ కెరీర్లోనే ఇది బెస్ట్ సాంగ్స్ లిస్టులో ఇది కూడా ఒకటవుతుందని మరియు యూరప్లో తీసిన పాటలు ఈ సినిమాకి ప్రత్యేక హైలైట్ అవుతాయని ఈ చిత్ర వర్గాలు అంటున్నాయి. యు.వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీకృష్ణ రెడ్డి మరియు ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్ లుక్ తో మరియు హై ప్రొడక్షన్ వాల్యూస్ తో తెరకెక్కిస్తున్నారు. ఇంకో రెండు రోజుల్లో యూరప్ షెడ్యూల్ పూర్తి చేసుకుని ఈ చిత్ర టీం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర టైటిల్ ని త్వరలోనే అధికారికంగా తెలియజేయనున్నారు. ఈ చిత్రాన్ని 2013 జనవరి 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు