రచ్చ ఆడియో వేడుకలో పలు విభిన్నమైన యాక్షన్ స్టంట్స్


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ‘రచ్చ’ చిత్ర ఆడియో ఈ నెల 26న విడుదలకు సిద్ధమైంది.ఈ వేడుకకు కర్నూలు వేదిక కానుంది. ఈ వేడుకలో పలు అధ్బుతమైన ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రముఖ స్టంట్ గ్రూప్ తో పలు విభిన్నమైన స్టంట్స్ కూడా చేయించబోతున్నారని కూడా సమాచారం. అయితే వీరిని ఇంకా ద్రువీకరించాల్సి ఉంది. తమన్నా హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ఫుల్ లెంగ్త్ కమర్షియల్ పాత్రలో కనిపించనున్నాడు. సంపత్ నంది డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ మూవీస్ వారు నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు.

Exit mobile version