బాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్లో స్పై యాక్షన్ చిత్రాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యానర్లో తెరకెక్కిన ‘వార్-2’ ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ బ్యానర్ నుంచి వస్తున్న తొలి లేడీ స్పై థ్రిల్లర్ చిత్రం ‘ఆల్ఫా’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ సినిమాలో స్టార్ బ్యూటీ ఆలియా భట్, శార్వరి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ డ్యాన్స్ ట్రాక్ సాంగ్ ఉందని.. దీని కోసం ఆలియా-శార్వరి ప్రస్తుతం రిహార్సల్స్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సాంగ్ సినిమాకే హైలైట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఇక ఈ సినిమాను శివ్ రావైల్ డైరెక్ట్ చేస్తుండగా ఈ మూవీలో అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హృతిక్ రోషన్ ఈ సినిమాలో ఓ సాలిడ్ కేమియో పాత్రలో కనిపించనున్నాడు.