పెళ్లి రూమర్స్‌పై అనిరుధ్ క్లారిటీ.. ఫేక్ న్యూస్ నమ్మొద్దు!

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతానికి అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. ఆయన అందించే ఎనర్జిటిక్ మ్యూజిక్‌ను ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, అనిరుధ్ రవిచందర్‌కు సోషల్ మీడియాలో ఎంత పాజిటివిటీ ఉందో, ఆయనపై అప్పుడప్పుడు రూమర్స్ కూడా అంతేస్థాయిలో ఉన్నాయి. తాజాగా అనిరుధ్ రవిచందర్ పెళ్లిపై ఓ వార్త జోరుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ప్రముఖ వ్యాపారవేత్త, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అధినేత కావ్య మారన్‌తో అనిరుధ్ గతకొంత కాలంగా డేటింగ్ చేస్తున్నారని.. త్వరలోనే ఆమెను అనిరుధ్ పెళ్లి చేసుకుంటాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ రూమర్స్‌పై అనిరుధ్ తాజాగా స్పందించాడు. తన పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. దయచేసి ఫేక్ న్యూస్ నమ్మవద్దు అంటూ ఆయన తన అభిమానులను కోరారు.

దీంతో అనిరుధ్ పెళ్లిపై వస్తున్న రూమర్స్‌కు ఆయన చెక్ పెట్టాడు. ఇక సినిమాల విషయానికి వస్తే, అనిరుధ్ త్వరలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుంది.

Exit mobile version