తగ్గేదే లే : తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేదికపై అల్లు అర్జున్ ఫైర్ బ్రాండ్ స్పీచ్..!

తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంతి రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చీఫ్ గెస్టులుగా వచ్చారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో బెస్ట్ యాక్టర్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-2’ సినిమా కోసం అవార్డును అందుకున్నాడు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. తనకు ఇలాంటి ప్రెస్టీజియస్ అవార్డు అందించిన తెలంగాణ ప్రభుత్వానికి.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, తన సినిమాను ఇంతలా అభిమానించిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఇలాంటి సినిమాను తనకు అందించిన సుకుమార్‌కు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని.. రాజమౌళి ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేయమని చెప్పడంతో ‘పుష్ప’ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకుందని.. అందుకే ఆయనకు స్పెషల్ థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమాలోని ఓ పవర్‌ఫుల్ డైలాగుతో అల్లు అర్జున్ స్టేజీపై ఉన్న గెస్టులను అలరించాడు. బన్నీకి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version