TGFA ఈవెంట్ : బాలీవుడ్, హాలీవుడ్ హైదరాబాద్‌కు రావాలి – సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

రాష్ట్ర అభివృద్ధిలో సినీ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందని.. రాబోయే రోజుల్లో సినీ పరిశ్రమ రాష్ట్రాభివృద్ధికి ప్రధాన బలంగా మారబోతుందని ఆయన అన్నారు. సినీ పరిశ్రమను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని రేవంత్ అన్నారు. సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి కష్టాలు, అవసరాలు ఉన్నా, తనకు నేరుగా చెప్పవచ్చని ఆయన అన్నారు.

సినిమాల కోసం హాలీవుడ్, బాలీవుడ్ వద్దకు వెళ్లడం కాదు.. వారే మన దగ్గరకు రావాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. అవార్డులు గెలుచుకున్న అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version