బాలయ్య ‘అఖండ 2’లో స్పెషల్ సాంగ్

నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సినిమా పై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. పైగా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను మేకర్స్ ప్లాన్ చేశారట. వచ్చే షెడ్యూల్ లో ఈ సాంగ్ ను షూట్ చెయ్యాలని, తర్వాత బాలయ్య షాట్స్ ను సాంగ్ లో యాడ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య మరోసారి అఘోరి పాత్రలో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అందాల భామ సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్‌ లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి.

Exit mobile version