బాలీవుడ్ ప్రెస్టీజియస్ బ్యానర్ యష్ రాజ్ ఫిలింస్ తెరకెక్కించిన లేటెస్ట్ స్పై సీక్వెల్ చిత్రం ‘వార్ 2’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కలిసి నటించారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆశగా చూశారు.
కట్ చేస్తే, ఈ సినిమాకు మిక్సిడ్ రెస్పాన్స్ దక్కింది. అయితే, ఫస్ట్ వీకెండ్ వరకు కలెక్షన్స్ బాగానే వచ్చినా, సోమవారం నుంచి ఈ వసూళ్ల వేగం తగ్గింది. ఇక తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.300.50 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ.240 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టగా.. రూ.196.50 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమాకు రూ.60.50 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మేకర్స్ వెల్లడించారు.
ఈ సినిమాకు పోటీగా ‘కూలీ’ కూడా ఒకే రోజు రిలీజ్ కావడంతో ఈ చిత్ర వసూళ్లపై కొంత ప్రభావం పడిందనే విషయం వాస్తవం. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. మరి టోటల్ రన్‌లో వార్ 2 ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.