టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సుహాస్ నుంచి ఈ ఏడాదిలోనే పలు సినిమాలు వచ్చాయి. అయితే తాను తమిళ సినిమాలో డెబ్యూ ఇస్తున్న తాజా చిత్రమే ” మండాడి”. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ నుండి 16వ ప్రాజెక్ట్‌గా హై-ఆక్టేన్ మూవీగా రాబోతోన్న సంగతి తెలిసిందే. ‘సెల్ఫీ’ ఫేమ్ మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూరి, సుహాస్ అద్భుతమైన పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ ఇంటెన్స్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఒక ల్యాండ్‌మార్క్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.
తెలుగు నటుడు, యంగ్ హీరో సుహాస్ పుట్టినరోజు సందర్భంగా ‘మండాడి’టీం శుభాకాంక్షలు తెలిపింది. ఈ చిత్రం కోసం సుహాస్ తన లుక్స్ మొత్తాన్ని మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు, కొత్త లుక్ ఇప్పటికే దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
సూరి, సుహాస్‌లతో పాటు మహిమా నంబియార్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ వంటి సీనియర్ నటులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. నిర్మాతలు త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.