ఎన్టీఆర్ ఎంట్రీ సీక్వెన్స్ కోసం స్పెషల్ సెట్ ?

ఎన్టీఆర్ ఎంట్రీ సీక్వెన్స్ కోసం స్పెషల్ సెట్ ?

Published on Jun 15, 2025 8:59 AM IST

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా పై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. ఐతే, ప్రస్తుతం ఈ సినిమా ఎంట్రీ సీక్వెన్స్ కోసం భారీ సెట్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ గెటప్ చాలా కొత్తగా ఉండబోతుందట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా ఈ సీక్వెన్స్ ను డిజైన్ చేశారని టాక్ నడుస్తోంది. అన్నట్టు ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ తో పాటు దాదాపు వేయి మంది జూనియర్స్ కూడా స్క్రీన్ లో కనిపిస్తారట. బహుశా, ఇది యాక్షన్ సీక్వెన్స్ అయ్యి ఉండొచ్చు.

ఇక ఈ మూవీ టైటిల్ ‘డ్రాగన్‌’ అని ప్రచారంలో ఉంది. ఐతే, ‘డ్రాగన్‌’ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు. కాబట్టి, ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు