బాలకృష్ణ – బోయపాటి సినిమా కోసం స్పెషల్ బైక్

బాలకృష్ణ – బోయపాటి సినిమా కోసం స్పెషల్ బైక్

Published on Sep 18, 2013 8:05 AM IST

Balakrishna
నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాని సాయి కొర్రపాటి – 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, ఖర్చుకి వెనకాడకుండా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలోని బాలకృష్ణ పాత్ర కోసం ఓ స్పెషల్ బైక్ ని సిద్దం చేసారు. ఈ బైక్ తయారీ కోసం స్పెషల్ డిజైనర్స్ ని పిలిపించారు. ఈ బైక్ పై కస్టం పెయింటింగ్స్ మరియు స్టైలిష్ చక్రాలు ఉండనున్నాయి. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలోని మరో హీరోయిన్ కోసం ఈ చిత్ర నిర్మాతలు అన్వేషిస్తున్నారు. అలాగే ఈ సినిమా 2014 మొదట్లో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు