ఈగ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నటించట్లేదు – రాజమౌళి

ఈగ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నటించట్లేదు – రాజమౌళి

Published on Jul 3, 2012 2:07 AM IST


ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం “ఈగ” చిత్రంలో చిన్న పాత్రలో నటించలేదని ఎస్ ఎస్ రాజమౌళి దృవీకరించారు. రెండు రోజుల క్రితం కొంతమంది మీడియా ప్రతినిధులు ప్రకటించిన కథనం ప్రకారం ఈ చిత్రంలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తళుక్కుమంటారని ఈ విషయాన్నీ రాజమౌళి బయట పెట్టలేదని ప్రకటించారు. ఈ కథనం గురించి వినగానే రాజమౌళి ఈ విషయం గురించి ట్విట్టర్లో “ఎస్పీ బాలు గారు ఈ చిత్రంలో నటించట్లేదు” అని చెప్పారు ప్రస్తుతం ఆయన ఈ చిత్రానికి తుది మెరుగులు దిద్దటంలో బిజీగా ఉన్నారు. నాని,సమంత మరియు సుదీప్ లు ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం జూలై 6న విడుదలవనుంది. సాయి కొర్రపాటి ఈ చిత్ర తెలుగు వెర్షన్ కి నిర్మాత కాగా ప్రసాద్ వి పోట్లురి తమిళ్ చిత్రానికి నిర్మాత. ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు

తాజా వార్తలు