సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ హీరోగా గ్రాఫికల్ మానియా గా తెరకెక్కుతున్న సినిమా ‘కొచ్చాడియన్’. ఈ సినిమాకి సంబందించిన మొదటి టీజర్ ఇటీవలే విదిదలైంది. ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ చాలా మంది ఈ సినిమా కార్టూన్ లాగా ఉందని భావిస్తున్నారు. ఈ విషయం పై స్పందించిన రజినీ కుమార్తె మరియు ఈ చిత్ర డైరెక్టర్ సౌందర్య కొచ్చాడియాన్ కార్టూన్ సినిమా కాదని తెలిపింది.
సౌందర్య మాట్లాడుతూ ‘ ఇండియాలో యానిమేషన్ ని కార్టూన్ అనుకుంటున్నారు. అవతార్ సినిమా కార్టూన్ కాదు అది యానిమేషన్ మూవీ. టిన్టిన్ అయితే పూర్తి కార్టూన్ ఫిల్మ్. నేను రజినీ కాంత్ రియల్ గా పెర్ఫార్మన్స్ చేసిన దాన్ని అలా క్రియేట్ చేసాము. దాన్ని 3డి వెర్షన్ లోకి మారుస్తున్నామని’ తెలిపింది. కొచ్చాడియాన్ సినిమా పాండ్యన్ కింగ్ అయిన కొచ్చాడియాన్ రణదీరన్ జీవిత కథ. దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్, శోభన తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.